Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
రాబోయే ఆర్థిక సంవత్సరంతో ఫ్రెషర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక ఏడాదిలో దాదాపు 150,000 ఉద్యోగ నియామకాలు చేపడతారని అంచనా. ఈ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. టీమ్‌లీజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 నుంచి 95,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాలలో కంపెనీలు తమ శ్రామిక…
Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్‌మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను…
Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేడు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) కీలక విషయాన్ని ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలోని ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Infosys: కరోనా మహమ్మారి ముగిసిపోవడంతో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి పలు ఐటీ సంస్థలు. ఇదిలా ఉంటే కొన్ని సంస్థలు వారానికి మూడు రోజులైన ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. హైబ్రీడ్ విధానంలో పనిచేయాలని సూచిస్తున్నాయి.
Wipro: భారత ఐటీ దిగ్గజం విప్రోలో కీలక ఉద్యోగి రాజీనామా చేశారు. రెండు దశాబ్ధాలుగా సంస్థలో పనిచేస్తున్న ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్ జతిన్ దలాల్ రాజీనామా చేసినట్లు గురువారం తెలిపింది. కంపెనీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న అపర్ణా అయ్యర్, దలాల్ స్థానంలో సెప్టెంబర్ 22 నుంచి నియమితులవుతారని విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఇతర అవకాశాల కోసం జతిన్ దలాల్ రాజీనామా చేసినట్లు విప్రో తెలిపింది.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.
Google: కోవిడ్ మహమ్మారి పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు దొరికింది. అయితే కోవిడ్ ప్రస్తుతం పోయినా కూడా కొందరు మాత్రం ఆఫీసులకు వెళ్లం, ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని చెబుతున్నారు. అలాంటి వారికి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి.
Meta Layoffs: ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది.
IT companies: ఆర్థికమాంద్య భయాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితులు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. స్టార్టప్స్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి.