IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సుమంత్ కథ్పాలియాపై కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకులో జరిగిన భారీ అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఆయన ఉద్యోగాన్ని అధికారికంగా రద్దు చేయడంతో పాటు, గతంలో చెల్లించిన వేతనం, బోనస్‌లను తిరిగి రాబట్టేందుకు (క్లాబ్యాక్) బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 20న జరిగిన బోర్డు సమావేశంలో కీలక తీర్మానం చేశారు.
2025లో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో డెరివేటివ్ ట్రేడింగ్ లావాదేవీలకు సంబంధించిన అకౌంటింగ్ లోపాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ అవకతవకల వల్ల బ్యాంకు నికర విలువపై సుమారు 230 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1,960 కోట్లు) ప్రతికూల ప్రభావం పడింది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత, బాధ్యత వహిస్తూ 2025 ఏప్రిల్‌లో సుమంత్ కథ్పాలియా తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన బ్యాంకులో ఉద్యోగిగా కొనసాగుతుండగా, ఈ మొత్తం వ్యవహారంపై బ్యాంకు అంతర్గత విచారణ చేపట్టింది.
Also Read
తాజాగా 2026 నవంబర్ 18న ఆ అంతర్గత విచారణ నివేదిక బోర్డుకు అందింది. నివేదికలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన బోర్డు, కథ్పాలియా సేవలను తక్షణమే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, 2020 మార్చిలో ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొందిన వేతనం, బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలను రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఆయన నుంచి ఎంత మొత్తాన్ని తిరిగి వసూలు చేయనున్నారనే విషయాన్ని బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. గతంలో ఇదే వ్యవహారంలో మాజీ డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ బ్యాంక్ మాజీ సీఈఓపై ఇంతటి కఠిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు దేశీయ బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!