Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.