NEET Controversy: “రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి”.. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Controversy: ఏ నిర్ణయం కూడా తన కూతురిని తిరిగి తీసుకురా లేదని.. కానీ న్యాయం జరుగుతుందనే తాను ఎదురు చూస్తున్నానని ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థిని తల్లి తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులకు ఉరిశిక్ష మాత్రమే సరైన శిక్ష ఆ తల్లి ఆవేదనతో డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, దానివల్ల తమకేం ఒరుగుతుందని మాతృమూర్తి నీలం చతుర్వేది ప్రశ్నించారు. పేపర్ లీక్‌కు కారణమైన అసలు దోషులను ఉరితీయాలని ఆమె పట్టుబట్టారు. ఆమె కుమార్తె ఆకాంక్ష చతుర్వేది (18) ఈ ఏడాది మే 20న నాగ్‌పూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకాంక్ష, “మరోసారి పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది.
తన కుమార్తె మరణంపై స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమకు సంతృప్తి లభించలేదని, కేవలం రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని నీలం వ్యాఖ్యానించారు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని, పేపర్ లీక్‌తో లక్షలాది మంది భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, వారికి మరణశిక్ష విధించాలని కోరారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష కుటుంబం, నీట్ కోచింగ్ కోసం నాగ్‌పూర్ వెళ్లింది. మే 3న జరిగిన పరీక్షను ఎంతో బాగా రాశానని, 650కి పైగా మార్కులు వస్తాయని ఆకాంక్ష కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తినడం, మాట్లాడటం మానేసి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమె తండ్రి చిన్న కమతంలో వ్యవసాయం చేస్తూ, నాగ్‌పూర్‌లో వంటమనిషిగా పనిచేస్తూ కూతురి చదువు కోసం అప్పులు చేశారు. ప్రస్తుతం ఆయన రెండుసార్లు గుండెపోటుకు గురై, పక్షవాతంతో బాధపడుతున్నారు. “అమ్మా నాన్న, మీ కూతురు బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ నాకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వచ్చేవి, కానీ ఇప్పుడు మళ్లీ అంత బాగా రాస్తాననే గ్యారెంటీ లేదు. నన్ను క్షమించండి అమ్మా నాన్న.. నేను అంతా పాడుచేశాను” అని ఆకాంక్ష తన సూసైడ్ నోట్లో రాసిన భావోద్వేగ మాటలు ఆ తల్లిదండ్రులను కుంగదీస్తున్నాయి. తన కూతురు బతికి ఉంటే కుటుంబాన్ని నిలబెట్టేదని, ఇప్పుడు తమను ఎవరు చూసుకుంటారంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు