Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ‘క’, ‘కే-ర్యాంప్’ సినిమాల తర్వాత తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం భారీ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందన అందుకుంటున్న ‘చెన్నై లవ్ స్టోరీ’లో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్ల సందర్భంగా వెబ్ సిరీస్‌ల గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన కిరణ్ అబ్బవరం, తాను ఇప్పటికే ఒక భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసే దశలో ఉన్నట్లు వెల్లడించారు.
డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతోందని తెలిపారు. ఇది చాలా పెద్ద వెబ్ సిరీస్. ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్ ముగుస్తుందని ఆయన చెప్పారు. ఇది వరకు నాలుగు నెలల క్రితమే ‘గువ్వల చెరువు ఘాట్’ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది పొలిటికల్, యాక్షన్, రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
దక్షిణ భారతదేశంలోని గువ్వల చెరువు అనే ఫ్యూడల్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో మొదట ఒక మామూలు ఫొటోగ్రాఫర్లా కనిపించే కిరణ్ అబ్బవరం పాత్ర, ఆ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుందని సమాచారం. డ్రీమ్ ఫార్మర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సంయుక్త మీనన్ ఓటీటీ అరంగేట్రం చేయడం మరో విశేషం. తిరువీర్, తేజస్వీ రావు, సిద్ధిక్, ఆడుకలం నరేన్, వికాస్ దర్శన్, మహర్షి విద్యా, మంజు భార్గవి, వినోద్ కిషన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ‘గువ్వల చెరువు ఘాట్’ విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయన ఓటీటీ ఎంట్రీ కూడా సినిమాల మాదిరిగానే విజయవంతమవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Tags
- cinema
- Kiran Abbavaram
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!