MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?
- ఎంజీ కామెట్ EV
- ధరలు పెంచిన కంపెనీ
- ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న MG కామెట్ EV కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలింది. JSW MG మోటార్ ఇండియా ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరలను పెంచింది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు సమాచారం. కొన్ని వేరియంట్లపై ఏకంగా రూ.17,000 వరకు ధర పెరిగింది.
ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగింది?
మీడియా నివేదికల ప్రకారం, MG కామెట్ EV వివిధ వేరియంట్లపై వేర్వేరు స్థాయిలో ధరలు పెంచింది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
Executive వేరియంట్ -రూ.17,000 వరకు పెంపు
Excite వేరియంట్ -రూ.17,000 వరకు పెంపు
Exclusive వేరియంట్ -రూ.7,000 వరకు పెంపు
దీంతో ఎంట్రీ లెవల్, మిడ్ వేరియంట్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై ఎక్కువ ప్రభావం పడనుంది.
బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి?
MG కామెట్ EVలో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ను అందిస్తున్నారు. ఈ బ్యాటరీని 7.4 kW ఛార్జర్ ద్వారా 10 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు 2.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్‌పై ఈ ఎలక్ట్రిక్ కారు 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది.
మోటార్ పనితీరు
ఈ చిన్న ఎలక్ట్రిక్ కారులో అమర్చిన మోటార్ 42 PS పవర్, 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా దీన్ని రూపొందించారు.
కొత్త ధరలు ఎంత?
ధరల పెంపు అనంతరం MG కామెట్ EV ప్రారంభ ధర రూ.7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.10.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!