దేశంలోని 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ టీకా ‘కొవాగ్జిన్’ వినియోగానికి ‘ఎన్‌టాగి’ స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. కొర్బెవ్యాక్స్‌ను 5-12 ఏళ్లలోపు పిల్లలకు వేయనుండగా, కొవాగ్జిన్ టీకా 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు ఉద్దేశించినది. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్ బయోటెక్‌కు ఏప్రిల్ 26న అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్‌లోనే డీసీజీఐ నిపుణుల ప్యానెల్ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.
Marburg Virus: ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్.. ఇప్పటికే ఇద్దరు మృతి
జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల మధ్య పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అలాగే మార్చి 16 నుంచి 12 ఏళ్ల పైబడిన వారికి భారత్‌లో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 12-14 ఏళ్ల వయస్సు గల పిల్లలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి ఆరేళ్ల చిన్నారులు మినహా అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.