India ready to export fever drugs to China amid COVID surge: ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ మేకర్ అయిన ఇండియా, చైనాకు జ్వరం మందులు పంపేందుకు సిద్దం అవుతోంది. కోవిడ్-19 వల్ల చైనా తీవ్రంగా దెబ్బతింటోంది. అక్కడ రోజుకు కొన్ని లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనాకు ఫీవర్ మెడిసిన్స్ ఎగుమతులను పెంచేందుకు సిద్ధంగా ఉందని భారత ఔషధ ఎగుమతి సంఘం చైర్‌పర్సన్ గురువారం తెలిపారు.
ఈ నెల మొదటి వారంలో చైనా తన ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేసింది. దీంతో చైనా వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లోనే ఏకంగా 25 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడినట్లు అంచానా. ఈ వారంలో ఒకే రోజు 3.7 కోట్ల కోవిడ్ కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజింగ్, షాంఘై నగరాల్లో జనజీవితం అస్తవ్యస్తం అయింది. పలు నగరాలు, పట్టణాల్లోని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి.
Read Also: Charles Sobhraj: సీరియల్ కిల్లర్ ప్లేస్ లో సినిమా యాక్టర్ ఫోటో వేశారు…
ఇదిలా ఉంటే చైనా వ్యాప్తంగా ఐబూప్రోపెన్, పారాసెటమాల్ మాత్రలకు చైనాలో భారీ డిమాండ్ ఏర్పడింది. అకాస్మత్తుగా పెరిగిన కోవిడ్ కేసులతో ఈ రెండింటికి డిమాండ్ ఏర్పడింది. వీటి కొనుగోలుపై చైనాలో పరిమితులు విధించారు. చైనా కోరితే సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే దీనిపై భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఇండియా ఫార్మా ఎగుమతుల్లో కేవలం 1.4 శాతం మాత్రమే చైనాకు ఎగుమతి అవుతున్నాయి. 2021-22 ఫార్మెక్సిల్ వార్షిక నివేదిక ప్రకారం ఇండియా డ్రగ్స్ ఎగుమతుల్లో అమెరికా అతిపెద్ద వాటాదారుగా ఉంది. కోవిడ్-19 తర్వాత భారత ఫార్మా కంపెనీల షేర్ల గత కొన్ని రోజులగా పెరుగాయి.