దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేరుస్తూ చైనా క్వారంటైన్‌ను ఎత్తివేసింది. ఆదివారం నుంచి కరోనా కూడా సాధారణ వ్యాధే.
India ready to export fever drugs to China amid COVID surge: ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ మేకర్ అయిన ఇండియా, చైనాకు జ్వరం మందులు పంపేందుకు సిద్దం అవుతోంది. కోవిడ్-19 వల్ల చైనా తీవ్రంగా దెబ్బతింటోంది. అక్కడ రోజుకు కొన్ని లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనాకు ఫీవర్ మెడిసిన్స్ ఎగుమతులను పెంచేందుకు సిద్ధంగా ఉందని భారత ఔషధ ఎగుమతి సంఘం చైర్‌పర్సన్ గురువారం తెలిపారు.
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు.…
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో 30 కోట్ల కేసులు నమోదైతే.. అందులో ఆరు కోట్ల కేసులు అమెరికాలోనే బయటపడ్డాయి. ఇక థర్డ్‌వేవ్‌లో ప్రతి రోజు లక్షల మందికి కరోనా సోకడం అమెరికాను కలవరపెడుతోంది. అమెరికాలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరీక్షిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా చైనాలో…
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది.. దేశ రాజధాని ఢిల్లీ సహా.. మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇక, ఢిల్లీలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.. దీంతో.. అప్రమత్తమైన ఆమ్ ఆద్మీ సర్కార్.. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అయితే, ఎలాంటి…
ప్రపంచం గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాదిమంది బలయ్యారు. ప్రతి దేశం ఈ కోవిడ్ బారిన పడింది. కరోనా ఇక తగ్గుముఖం పట్టిందిలే అని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తోంది. మూడుకేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ మళ్లీ తన సత్తా చాటుతుందని భావిస్తున్న వేళ పలు దేశాలు కఠిన ఆంక్షలవైపు మళ్లుతున్నాయి. ఈసారి సరికొత్త రూపంలో లాక్డౌన్లకు సిద్ధమయ్యాయి. కరోనా నుంచి రక్షణగా భావిస్తున్న టీకా…
తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ…