Charles Sobhraj: సీరియల్ కిల్లర్ ప్లేస్ లో సినిమా యాక్టర్ ఫోటో వేశారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ని విడుదల చేస్తూ నేపాల్ కోర్ట్ తీర్పునిచ్చింది. నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్ రిలీజైయ్యాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు నేపాల్ కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్ దేశంలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడనే ఆరోపణలపై శోభరాజ్ అరెస్టయ్యాడు. నేపాల్ దేశ కోర్టు శోభరాజ్ కు జీవిత ఖైదు విధించింది. శోభరాజ్ తల్లిదండ్రులు వియత్నాం, ఇండియన్ లు. ఇతను ఫ్రెంచి పౌరుడని నేపాల్ పోలీసులు చెప్పారు. 78 ఏళ్ల శోభరాజ్ పలు హత్య ఘటనలకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.
Read Also: Charles Sobhraj: ఆయనకు 64, ఆమెకు 21.. సీరియల్ కిల్లర్‌తో మూడుముళ్ళు..
Also Read
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
ఇదిలా ఉంటే ఈ సీరియల్ కిల్లర్ న్యూస్ ని కవర్ చేస్తూ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ రాసిన ఒక ఆర్టికల్ లో ఘోరమైన తప్పిదం చేసింది. ఈ ఆర్టికల్ లో శోభరాజ్ అనుకోని సినిమా యాక్టర్ ‘రణదీప్ హూడా’ ఫోటోని అటాచ్ చేశారు. డిసెంబర్ 22న బయటకి వచ్చిన ఈ పేపర్ చూడగానే రణదీప్ హూడా షాక్ అయ్యి, సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నాడు. “Is that a back handed compliment @timesofindia or did you genuinely get confused between the “real” and “reel” Charles Sobhraj ?” అంటూ రణదీప్ హూడా ట్వీట్ చేశాడు. ఇంతకీ అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా అంతటి వాళ్లు రణదీప్ హూడాని చార్లెస్ శోభరాజ్ అని ఎందుకు కన్ఫ్యూస్ అయ్యారు అంటే 2015లో రణదీప్ హూడా ‘మెయిన్ అవుర్ చార్లెస్’ అనే సినిమాలో నటించాడు. చార్లెస్ శోభరాజ్ జీవితంలోని కొన్ని సంఘటనలని తీసుకోని ఈ సినిమాని రూపొందించారు. ఇందులో రణదీప్ హూడా, చార్లెస్ శోభరాజ్ లుక్ ని యాజ్ ఇట్ ఈజ్ గా దించేసాడు. ఈ కారణంగానే రణదీప్ హూడాని చార్లెస్ శోభరాజ్ అనుకోవాల్సి వచ్చి ఉంటుంది.
Is that a back handed compliment @timesofindia or did you genuinely get confused between the "real" and “reel” Charles Sobhraj ? 🤔😜 pic.twitter.com/5Fa1DwMjra
— Randeep Hooda (@RandeepHooda) December 23, 2022
Read Also: Charles Sobhraj: జైలు నుంచి బయటకు వచ్చిన బికినీ కిల్లర్
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!