Russia: భారత్-రష్యా బంధంపై మరోసారి రష్యా ప్రశంసలు కురిపించింది. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను నిర్ణయించుకునే, దాని భాగస్వాములను ఎన్నుకునే గొప్ప శక్తి కలిగి ఉందని ఆయన అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి విలేకరుల సమావేశంలో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
Read Also: Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..
రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేస్తున్నందున ఆ దేశంపై ఒత్తిడి చేయడం పూర్తిగా అన్యాయమైనదని ఆయన అన్నారు. భారత్ తన సొంత ప్రయోజనాలను నిర్దేశించుకునే “గొప్ప శక్తి” అని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడి లోనవుతుందని మాకు తెలుసని, ఇది అంతర్జాతీయ రంగంలో పూర్తిగా అన్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇటీవల రష్యాలో పర్యటించడం, రష్యాతో ఇంధన సహకారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జూలై 8-9 తేదీల్లో రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోడీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, ఈ పర్యటనపై వెస్ట్రన్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ్ మాట్లాడుతూ.. ప్రపచంంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య నాయకుడు, ప్రపంచంలో రక్తపాత నేరస్తుడిని కౌగిలించుకోవడం నిరాశకు గురి చేసింది’’ అని మోడీ, పుతిన్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.