Corona Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases In India: దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,439 కేసులు నమోదు అయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 70 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 65,732కు చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉంది. ఒక్కరోజులో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,44,15,723కి చేరుకుంది. అయితే వ్యాధి బారి నుంచి రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో సగటు కోవిడ్ రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. ఇండియాలో 4,38,25,024 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.64 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది. దేశంలో ఆదివారం 26,36,224 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 212.17 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,418 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
Inter Supplementary Results : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 4,38,618 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,279 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 606,419,045 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,489,681 మంది మరణించారు. సోమవారం మరో 7,99,759 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 582,001,805కు చేరింది. జపాన్‌లో కొత్తగా 1,53,225 కేసులు వెలుగుచూశాయి. మరో 235 మందికిపైగా మరణించారు.దక్షిణ కొరియాలో 43,142 కొవిడ్ కేసులు,49 మరణాలు నమోదయ్యాయి.అమెరికాలో 30,148 కొత్త కేసులు, 112 మరణాలు వెలుగుచూశాయి.
తాజావార్తలు
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భారీ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!