By Election Results 2024: నేడు ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ట్రెండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అద్భుతంగా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో లోక్‌సభలో పొత్తుల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నిరాశాజనక పనితీరు కనబరుస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా బీజేపీ పార్టీ తన స్థానంలో కూడా ఓడిపోయినట్లు కనబడుతుంది.
Read Also: Health Tips: నిజమా..! పసుపు నీరు తాగితే బరువు తగ్గుతారా? ట్రై చేయండి..
కాగా, 13 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ, డీఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, నలాగఢ్ తో పాటు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూరు, మధ్యప్రదేశ్‌లోని అవార్‌వాడ స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే, పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మానిక్తలా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ స్థానంలో ఆప్ ఆధిక్యంలో ఉండగా.. బీహార్‌లోని రూపాలి స్థానంలో జేడీయూ ముందంజలో ఉంది. ఇక, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. తమిళనాడులోని విక్రవాండి స్థానంలో డీఎంకే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Read Also: Arekapudi Gandhi: కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్..
అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా.. ఉత్తరాఖండ్‌లో మాత్రం గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే, బీహార్‌లోని రూపాలి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆర్జేడీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానం మరోసారి జేడీయూ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ తేజస్వి యాదవ్ పార్టీ మూడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ బలహీనపడిపోయింది. అదే సమయంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది.. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మొహిందర్ భగత్ 37 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్‌పై విజయం సాధించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్‌తో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, కొంతమంది కొత్తవారి భవితవ్యాన్ని నిర్ణయించనుంది.