Independence Day 2024: భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని నరేంద్రమోడీతో ఉన్న ఫోటోని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆమె తన ఎక్స్ పోస్టులో ప్రధాని మోడీని కూడా ట్యాగ్ చేశారు. ‘‘78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, నేను భారతదేశ ప్రజలకు మరియు ముఖ్యంగా ఈ పేజీని అనుసరించే అనేక మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటలీ మరియు భారతదేశం ఎప్పటికీ బలమైన బంధాన్ని పంచుకుంటాయి. ఇరు దేశాలు కలిసి గొప్ప విషయాలను సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాల భవిష్యత్తుకు ముఖ్యమైన స్తంభం’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: Uttarakhand: రెచ్చిపోతున్న కామాంధులు.. నర్స్పై అత్యాచారం, హత్య
ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టాక తొలి విదేశీ పర్యటనగా ఆయన ఇటలీ వెళ్లారు. మేలో జరిగిన జీ 7 సదస్సుకు ప్రధాని మోడీని మెలోనీ స్వయంగా ఆహ్వానించారు. ఇరువురు నేతలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. జీ 7 దేశాల్లో సభ్యత్వం లేకున్నా, భారత్‌ని ప్రముఖ దేశంగా ఆమె ఆహ్వానించారు. ఇరువురు నేతల సమావేశ సమయంలో ఇరువురు నేతల పేర్లను కలిపి ‘‘మెలోడీ’’గా పిలవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
In occasione del 78° Giorno dell'Indipendenza, desidero esprimere i miei più sinceri auguri al popolo indiano, e in particolare ai molti indiani che seguono questa pagina. Italia e India condividono un legame sempre più forte, e sono certa che insieme raggiungeremo grandi… pic.twitter.com/DG8Ujo03Co
— Giorgia Meloni (@GiorgiaMeloni) August 15, 2024