అ! సినిమాతో అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హను మాన్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. దీంతో వర్మ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా అతని టాలెంట్ గుర్తించింది. కానీ ఏం లాభం.. ప్రశాంత్ వర్మ సినిమాలు తప్ప అన్ని చేస్తున్నారు. తన డైరెక్షన్‌లో ఎనౌన్స్ చేసిన అధీర, జై హనుమాన్ ఎంత వరకు వచ్చాయో అప్డేట్ లేదు. కథ అందించిన ‘మహాకాళి’ కి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ప్రభాస్‌తో మూవీ అంటూ వార్తలొచ్చాయి.. ఉందో లేదో కూడా తెలియదు. మరీ హనుమాన్ డైరెక్టర్ ఏం చేస్తున్నట్లు..?
Also Read : Salman khan : ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సికందర్’
జై హనుమాన్, అధీరా ఈ రెండు సినిమాలకు కనీసం హీరో ఎవరో ఆడియన్స్‌కు తెలుసు. కానీ ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ‘మహాకాళి’ లో ఫిమేల్ లీడ్ ఎవరో తెలియదు. ఇక హనుమాన్ జయంతి రోజున, జై హనుమాన్ మూవీ అప్డేట్ ఇస్తాడేమో, అనుకుని చూస్తున్న ఆడియన్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు ప్రశాంత్. మూవీలకు కామ పెట్టి పీవీసీయు అనే క్లాతింగ్ వెబ్ సైట్ స్టార్ట్ చేశారు. ఇక ఈ ఎనౌన్స్ మెంట్ చూసిన మూవీ లవర్స్‌కు కోపం కట్టలు తెంచుకుంది .దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వేంటి.. నీ విజనేంటీ..? అసలు ఏం చేద్దామనుకుంటున్నావ్..? ప్రభాస్ తో సినిమా అన్నావ్ ఏది.? అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రేక్షకుల రిక్షన్‌కి ప్రశాంత్ వర్మ రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.