దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. ముందస్తు రుతుపవనాల రాక కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
Petrol, Diesel Sales Fall In July: దేశంలో పెట్రోల్, డిజిల్ అమ్మకాలు జూలై నెలకు గానూ తగ్గిపోయాయి. సాధారణంగా రుతుపవనకాలంలో ప్రతీ సారి పెట్రోల్, డిజిల్ అమ్మకాలు తగ్గుతూ ఉంటాయి. ఈ సారి కూడా ఇదే విధంగా ఇంధన వినియోగం తగ్గింది. సాధారణంగా రుతుపవన కాలంలో వర్షాల కారణంగా ప్రజల ప్రయాణాలు తగ్గడంతో పాటు వ్యవసాయ రంగంలో పంప్ సెట్ల వాడకం తగ్గడం పెట్రోల్, డిజిల్ అమ్మకాలను ప్రభావితం చేస్తాయి. తాజాగా ఉన్న గణాంకాల ప్రకారం…
రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. మృగశిర కార్తె ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా సరిగా వానలు పడలేదు. మృగశిర కార్తె వల్ల ముసురు పడుతుంది. వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా.. గత కొద్దిరోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడ్డ బెజవాడ వాసుల్ని వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. వాన కురిపించాడు. భారీవర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానజల్లులు కురిశాయి.రహదారులపైకి చేరిన వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి డ్రైనేజీలు. గత…