Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్‌కి దిక్కు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోలేకపోయింది. బీజేపీ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో బీజేపీ రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ పరిణామాలు ఆ రాష్ట్రంలో సీఎం సుఖ్వీందర్ సుఖు ప్రభుత్వాన్ని సంక్షోభం అంచుకు తీసుకెళ్లింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ పరిణామాలు కలవరపెడుతున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సుఖు, ఈ తర్వాత తాను రాజీనామా చేయడం లేదని, తాను పోరాటం కొనసాగిస్తానని అన్నారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: Uttar Pradesh: ప్రభుత్వ స్కీమ్ పొందేందుకు భర్తనే మార్చేసింది.. వేరే వ్యక్తితో పెళ్లి తంతు..
హిమాచల్ చేజారితే, సొంతగా కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నట్లు అవుతుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమితో అధికారం పంచుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 35 మ్యాజిక్ ఫిగర్ కాగా.. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా కాంగ్రెస్‌కి ఎదురుతిరగడంతో ఆ పార్టీకి సమస్య మరింత పెరిగింది. సుఖు ప్రభుత్వం తమను విస్మరించిందని ఆయన ఆరోపించారు.
క్రాస్ ఓటింగ్ అనంతరం బీజేపీ ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్, పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వ కుప్పకూలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరో 3 నెలల వరకు లేవు. అయితే సుఖు ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల విశ్వాసం ఉందో లేదో తెలుసుకునేందుకు గవర్నర్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వొచ్చు.
గత వైభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్:
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ సొంతగా అధికారంలో ఉంది. జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాల్లో జూనియర్ భాగస్వామిగా ఉంది. ఒక వేళ హిమచల్‌లో ప్రభుత్వం కూలిపోతే, కేవలం దక్షిణాది మాత్రమే కాంగ్రెస్‌కి దిక్కవుతుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కాంగ్రెస్‌కి బలం ఉంది. కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో ఈ పార్టీకి మంచి పట్టు ఉంది. కర్ణాటక, తెలంగాణలకు గతేడాది ఎన్నికలు జరగగా, కేరళలో 2026 వరకు అసెంబ్లీ ఎన్నికలు లేవు.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!