Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trent Boult: న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ప్రమాదకర బౌలర్‌గా మారుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ 2026 టోర్నీలో మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ది హండ్రెడ్ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్, ఎంఐ లండన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించిన ట్రెంట్ బౌల్ట్ మొదటి నుంచే తన బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్‌స్టో క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండగా.. బౌల్ట్ వేసిన ఇన్‌స్వింగ్ యార్కర్ నేరుగా లెగ్ స్టంప్‌ను తాకింది. బెయిర్‌స్టో ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినా.. బంతి వేగం, లెంగ్ సరిపోవడంతో బ్యాట్ కూడా తగలలేదు. దీంతో అతడు 7 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
Also Read
- Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
‘బై-బై’ సెలబ్రేషన్:
వికెట్ తీసిన అనంతరం ట్రెంట్ బౌల్ట్ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెయిర్‌స్టో వైపు చూస్తూ చేతిని ఊపుతూ ‘బై-బై’ అంటూ సెండ్ఆఫ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సెండ్ఆఫ్ బెయిర్‌స్టోకు నచ్చలేదు. పెవిలియన్‌కు వెళ్తూ వెనక్కి తిరిగి బౌల్ట్‌తో కొన్ని మాటలు మాట్లాడాడు. దానికి బౌల్ట్ కూడా స్పందించడంతో ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం చోటుచేసుకోలేదు. ప్రస్తుత ది హండ్రెడ్ 2026 సీజన్లో ట్రెంట్ బౌల్ట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు