Adhir Ranjan: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఎన్డీయే కూటమిలో చేరాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆహ్వానించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ అథవాలే మాట్లాడుతూ.. అతను (అధిర్ రంజన్) పశ్చిమ బెంగాల్ నుంచి ఓడిపోయినందుకు కాంగ్రెస్ విస్మరించిందని, అవమానించబడ్డాడని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి వైఖరి వల్లే చాలా మంది నేతలు కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారని అన్నారు. కాంగ్రెస్ అవమానిస్తే, ఆ పార్టీని వీడాలని అధిర్ రంజన్‌ని అభ్యర్థిస్తున్నానని అథవాలే అన్నారు. ఎన్డీయేలో లేదా తన పార్టీ ఆర్పీఐలో చేరాలని ఆహ్వానించారు.
Read Also: Minister Narayana: నవీ ముంబైలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన
పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా ఉన్న తనను ఎలా తొలగించారని అధిర్ రంజన్ మంగళవారం అసంతృప్తిని వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడైన రోజు, పార్టీ రాజ్యాంగం ప్రకారం దేశంలోని పార్టీలోని అన్ని పదవులు తాత్కాలికంగా మారాయి, నా పదవి కూడా తాత్కాలికమే అని అధిర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఖర్గే మాట్లాడుతూ.. అవసరమైతే తనను బయట ఉంచుతామని చెప్పడం నన్ను కలవరపెట్టిందని చెప్పారు. తాత్కాలిక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అది నా బాధ్యతని, వీలైతే మీరు నా స్థానంలో మరొకరిని నియమించుకోవచ్చని ఖర్గేకి తాను చెప్పినట్లు తెలిపారు.
‘‘ నా అధ్యక్షతన సమావేశం జరిగిందని, నేను ఇప్పటికీ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నానని నాకు తెలుసు. కానీ సమావేశంలో గులాం అలీ మీర్ ప్రసంగిస్తూ మాజీ అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నారని అన్నారు. ఆ సమయంలోనే తాకు తెలిసింది నేను మాజీ అధ్యక్షుడినయ్యానని’’ అని అతను చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీతో పొత్తను అధిర్ రంజన్ వ్యతిరేకించారు. ఎన్నికల్లో పొత్తు లేకుండానే టీఎంసీ, కాంగ్రెస్ పోటీ చేశాయి. మొత్తం 42 సీట్లలో టీఎంసీ 29 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒకే స్థానంలో గెలుపొందింది.