Adhir Ranjan: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఎన్డీయే కూటమిలో చేరాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆహ్వానించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ అథవాలే మాట్లాడుతూ.. అతను (అధిర్ రంజన్) పశ్చిమ బెంగాల్ నుంచి ఓడిపోయినందుకు కాంగ్రెస్ విస్మరించిందని, అవమానించబడ్డాడని అన్నారు.
పార్టీ చీలికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కారణమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ రాష్ట్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నమాట.. అయితే, మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు చోట్ల రాజధానులు చేస్తామంటోందన్నారు. ఒక రాజధాని అమరావతిలోనే సరిగ్గా అభివృద్ధి జరగడంలేదు.. ఇలాంటి సమయంలో మూడు చోట్ల రాజధానుల ప్రతిపాదన సరైంది కాదన్నారు.. రెండు చోట్ల రాజధానులు పెట్టినా పర్వలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం…
ఏదో వచ్చారు… వెళ్లారు అని కాకుండా.. ఏపీ పర్యటనలో ఓ కేంద్రమంత్రి చేసిన కామెంట్స్.. బీజేపీకి టెన్షన్ తెచ్చిపెట్టాయి. రాబోయే కష్టాలు తలుచుకుని కలవర పడుతున్నారట. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఆయన చెప్పిందేంటి? కమలనాథులకు రుచించని ఆ మాటలేంటి? వైసీపీని ఎన్డీయేలో చేరాలన్న అథవాలే..! రాందాస్ అథవాలే. కేంద్రమంత్రి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో భాగస్వామి. మాటలతో.. వ్యంగ్యాస్త్రాలతో.. ప్రాసలతో వైరిపక్షాలకు కూడా నవ్వులు పూయిస్తుంటారు అథవాలే. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ఆయన.. కొన్ని పొలిటికల్…