తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు ఆస్ట్రేలియాలో ఉండడంతో, ఆయన వచ్చాక బుధవారం నాడు అంత్యక్రియలు చేయనున్నారు. ఆయనకు భార్య మంగాయమ్మ, కుమారుడు సతీష్, కుమార్తె మాధవి ఉన్నారు. ముళ్ళపూడి బ్రహ్మానందం ఇవివి సత్యనారాయణకు బావమరిది అవుతారు. ఇవివి సోదరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన నిర్మాతగా అల్లుగుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్న దాన, నేను లాంటి సినిమాలను నిర్మించారు.