PM Modi: “సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు”.. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు, వారి కూటమి ఇండియాను విమర్శించారు. మధ్యప్రదేశ్ లోని గుణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అవమానించడమే అని ఆయన అన్నారు. ‘‘ ఇండియా కూటమిలో ఒక పెద్ద నాయకుడు (నితీష్ కుమార్) అసెంబ్లలో అసభ్య పదజాలం ఉపయోగించాడదు. వారికి సిగ్గులేదు. ఇండియా కూటమిలోని ఏ నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. మహిళల గురించి ఆలోచించే పద్దతి ఇదేనా..? వారు మీకు మంచి చేయగలారా..?’’ అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవారు మన దేశాన్ని అవమానిస్తున్నారు. మీరు ఎంత దిగజారిపోతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
Read Also: K Annamalai: బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల ముందు ‘పెరియార్’ విగ్రహాలు తొలగిస్తాం..
నిన్న బీహార్ అసెంబ్లీలో కులగణనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ గురించి ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయిందని, లైంగిక సంపర్కం సమయంలో స్త్రీకి తమ భర్తలను ఎలా నిరోధించాలో వివరించారు. భర్తలు చేసిన చర్యలు మరన్ని జననాలకు దారి తీశాయని, అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా అడ్డుకోవాలో తెలుసని, అందుకే జననాలు తగ్గాయని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం వివాదంగా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇది జేడీయూ అసలు స్వరూపమని, 70 ఏళ్ల నితీష్ కుమార్ ని అడాల్ట్ పురుగులు కుట్టాయని విమర్శించింది. జాతీయ మహిళా కమిషన్ కూడా నితీష్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!