Himanta Biswa Sarma Gives Suggestions To Women On Motherhood: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మహిళలకు కొన్ని సూచనలు ఇచ్చారు. గువాహటిలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఆయన.. మహిళలు ఎప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడం, ఏ సమయంలో గర్భం దాల్చాలన్న విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చకపోతే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా అన్నారు. మహిళలు తల్లి అయ్యేందుకు 22 నుంచి 30 ఏళ్ల వయసు చాలా అనుకూలమైనదని, బిడ్డలను కనే విషయంలో ఆలస్యం చేయరాదని సూచించారు. యుక్త వయసు వచ్చాన, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండే.. వెంటనే పెళ్లి చేసుకోవాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే గర్భం దాల్చడం వంటి వాటిని నిరోధించడం కోసం ఫోక్సో చట్టం కఠినమైన చట్టాలు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.
Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..
హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ‘‘14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరం. చట్టబద్ధంగా వివాహం చేసుకున్నా సరే, అది నేరంగానే పరిగణించబడుతుంది. రాబోయే ఐదారు నెలల్లో అలాంటి భర్తలు అరెస్ట్ చేయబడతారు’’ అని పేర్కొన్నారు. మహిళల వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలు అని పేర్కొన్న ఆయన.. చిన్న అమ్మాయిలను వివాహం చేసుకున్న వారిపై కూడా చట్టం తీసుకురావడం జరుగుతుందని అన్నారు. చిన్న వయసున్న బాలికలను వివాహం చేసుకున్న పురుషులకు జీవితఖైదు పడే అకాశాలున్నాయని కూడా హెచ్చరించారు. ఇక మాతృత్వం గురించి మాట్లాడుతూ.. మహిళలు తల్లులు కావడానికి చాలా కాలం వేచి ఉండకూదని, ఇది సంక్లిష్టతలకు దారితీస్తుందని అన్నారు. మాతృత్వానికి 22 నుంచి 30 సంవత్సరాలు తగిన వయసు అని చెప్పారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడాన్ని వ్యతిరేకిస్తామని, కానీ మాతృత్వం కోసం మహిళలు ఎక్కువ కాలం వేచి ఉండకూడదని పేర్కొన్నారు. ఆయా విషయాలకు అనుగుణంగా దేవుడు మన శరీరాల్ని సృష్టించాడని వెల్లడించారు.
Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్‌తోనే..
కాగా.. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. 14-18 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకునే వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 కింద విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో అధిక మాతాశిశు మరణాలను, బాల్య వివాహాలను అరికట్టేందుకు అసోం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సగటున 31 శాతం వివాహాలు నిషేధిత వయో వర్గాలేనని అసోం సీఎం తెలిపారు. అసోం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.