Teddy Love : మనం నిత్యం ఎన్నో రకాల ప్రేమకథలు వింటూనే ఉంటాం. ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో చెప్పలేము. కొన్ని ప్రేమకథలు వింటే షాక్ అవ్వకుండా ఉండలేము. ఈ విధమైన ప్రేమ కథ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ మహిళ టెడ్డీ బేర్‌తో ప్రేమలో పడినట్లు వెల్లడైంది. తన భర్త చనిపోయాక గత పదేళ్లుగా టెడ్డీ బేర్‌తో జీవిస్తున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ తెలిపింది. యువతి తన ప్రేమ కథ గురించి సోషల్ మీడియా ద్వారా చెప్పింది. అన్ని వేళలా టెడ్డీ బేర్ తనకు తోడుగా ఉందని మహిళ పేర్కొంది. ఆమె టెడ్డీని చాలా ఇష్టపడుతుంది.. దాంతోనే జీవిస్తున్నట్లు పేర్కొంది.
Read Also:Street Vendor Fraud: స్ట్రీట్ వెండర్‌పై జీఎస్టీ బాదుడు.. ఏకంగా 366 కోట్ల జరిమానా!
తన జీవితంలోని అన్ని ముఖ్యమైన క్షణాలను టెడ్డీ బేర్‌తో మాత్రమే పంచుకుంటానని మహిళ చెప్పింది. ఆమె విజయం వెనుక టెడ్డీ బేర్ ఉంది. ‘నేను చెప్పేదంతా వింటాడు. సుఖంలోను, దుఃఖంలోను ఆమెకు తోడుగా ఉంటాడు’అని చెప్పింది. ఈ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో యూట్యూబ్ లో భాగస్వామ్యం భారీగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Fraud Gang : ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు
ఇదిలా ఉంటే ఇలాంటి అనుచిత వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అలాంటి వీడియోలు స్వల్ప కాలంలోనే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్నీ, వింత, విచిత్రం, షాకింగ్ వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. కొంత మంది లైమ్‌లైట్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి వీడియోలను షేర్ చేస్తున్నారు.