Calcutta High Court: పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు తేలింది. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది.