మ‌నం తాగే పాల క‌న్నా జున్నులో పోష‌కాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందువ‌ల్ల వాటితో పోష‌ణ, శ‌క్తి ల‌భిస్తాయి.

జీర్ణవ్యవ‌స్థ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే మంచి బాక్టీరియా.. జున్నులో ఎక్కువగా ఉంటుంది.

జున్ను పాల‌ను తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి ర‌క్షణ ల‌భిస్తుంది.

జున్ను పాల‌లో సాధార‌ణ పాల క‌న్నా కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఎముక‌లు దృఢంగా, బ‌లంగా మారుతాయి.

జున్నులో కొద్దిగా మిరియాల పొడి, యాల‌కుల పొడి క‌లుపుకుని తింటే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

జున్నులో ఉండే పోషకాలు.. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో దోహదపడతాయి.

ప్రతిరోజూ 2 ఔన్సుల జున్ను తింటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 18 శాతం తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు.

సన్నగా ఉన్నవారు లావు పెరగాలనుకుంటే.. జున్ను తింటే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే.. శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.

జున్ను తరచుగా తీసుకుంటే.. చర్మం సౌందర్యం రెట్టింపవుతుంది.