పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు దేశంలో అమ్మాయిల పెళ్లిళ్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నవయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, నగదు కొరత ఉన్న పాకిస్తానీ తల్లిదండ్రులు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలను వివాహం కోసం వ్యాపారం చేస్తున్నారు.
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, అందుకు సంబంధించిన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.
అసోం ప్రభుత్వం బాల్య వివాహాలపై పెద్దఎత్తున అణచివేత ప్రారంభించడంతో తమ భర్తలు, కుమారులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అసోంలో నేటి నుంచి బాల్య వివాహాలపై భారీ అణచివేతను ప్రారంభించనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం శుక్రవారం నుంచి భారీ అణిచివేత, నేరస్థులను అరెస్టు చేయడంతోపాటు విస్తృతమైన అవగాహన ప్రచారాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
దేశంలో బాల్యవివాహాల విషయంలో కేంద్రం ఓ నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం తక్కువ వయస్సు గల అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్న రాష్ట్రంగా జార్ఖండ్ అపఖ్యాతి పాలైంది.