ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇక ముంబైలో కొత్తగా ప్రారంభించిన వర్లి భూగర్భ మెట్రో స్టేషన్ వరదల్లో మునిగిపోయింది. పైకప్పు లీకేజీలు కారణంగా ఏకధాటిగా కురిసిన వర్షంతో మెట్రో స్టేషన్ బురదతో నిండిపోయింది. వరద నీటిలోనే ప్రయాణికులు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఇది కూడా చదవండి: French: భార్య చేతిలో తన్నులు తిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు.. వీడియో వైరల్
ఈసారి ముంబైకు ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. 75 ఏళ్లలో ఇంత త్వరగా నైరుతి రుతుపవనాలు రావడం ఇదే తొలిసారి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక భూగర్భ మెట్రో స్టేషన్ అంతా నీటి మునిగిపోయింది. ప్లాట్‌ఫామ్‌లపైకి నీరు వచ్చింది చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తగిన విధంగా డ్రైనేజీ లేకపోవడంతో నీరు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Virgin Boys: కాక రేపేలా ‘పెదవుల తడి’ సాంగ్!
ముంబై మెట్రో లైన్ 3 బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి వర్లిలోని ఆచార్య ఆత్రే చౌక్ వరకు ఈ నెల ప్రారంభంలో మే 10న మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇంతలోనే తాజాగా కురిసిన వర్షానికి మొత్తం స్టేషన్ అంతా నీట మునిగిపోయింది. దీంతో మెట్రో స్టేషన్ నిర్మాణంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు స్టేషన్ నిర్మాణంపై ప్రశ్నలు సంధించారు.
ఇక ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 సమయానికి ముంబై పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో 295 మి.మి. వర్షపాతం నమోదైంది. 107 ఏళ్లలో మే నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 279.4 మి.మిగా నమోదైంది. ఇప్పుడా రికార్డు బద్ధలైంది. 1990 తర్వాత సీజన్ కంటే ఇంత ముందుగా ముంబైలో వర్షాలు పడటం ఇదే తొలిసారి. ఇక ముంబై, థానే, రాయగడ్, రత్నగిరి ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE
— Tejas Joshi (@tej_as_f) May 26, 2025