ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్య బ్రిగిట్టే చేతిలో ఆయన తన్నులు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Deputy CM Bhatti: కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ అన్నారు..
నాలుగు రోజుల ఆగ్నేయాసియా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు మాక్రాన్ దంపతులు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో విమానం తలుపు తెరుచుకోగానే.. భార్య బ్రిగిట్టే.. మాక్రాన్ ముఖంపై దాడి చేసింది. చెంప దెబ్బలు కొట్టింది. దీంతో మాక్రాన్ షాక్‌కు గురయ్యారు. వెంటనే మాక్రాన్ తేరుకుని హాయ్ చెప్పడం కనిపించింది. ఇక విమానంలోంచి భార్యతో దిగబోతుండగా చెయ్యి పట్టుకునేందుకు మాక్రాన్ ప్రయత్నించారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఎడముఖం పెడముఖంతోనే ఇద్దరూ విమానం దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ.. దంపతుల మధ్య కలహాలు ఉన్నట్లుగా మాత్రం దృశ్యాలను బట్టి అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. డీఎంకేపై పంచ్‌లు..
❗️ Macron's wife viciously SMACKS him in face pic.twitter.com/2zSalRFYLu
— RT (@RT_com) May 26, 2025