Virgin Boys: కాక రేపేలా ‘పెదవుల తడి’ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో విడుదల కానున్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఆసక్తి రేపుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాలోని ‘పెదవుల తడి’ పాట విడుదల అయ్యింది. ఇది యువ హృదయాలను కట్టిపడేసేలా ఉంది. పూర్ణ చారి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఆర్ కె గొంతులోని మాయాజాలం పాటకు ప్రాణం పోసింది. అతని గాత్రంలో భావోద్వేగం, యువతీయువకుల ప్రేమ ఊహలను పట్టిస్తూ, పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. స్మరణ్ సాయి సంగీతం ఈ పాటకు యవ్వన శక్తిని, శృంగార హాంగ్‌ను జోడించింది.
Also Read: Naveen Polishetty : సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’
Also Read
వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా మలిచింది. నటీనటుల కెమిస్ట్రీ స్క్రీన్‌పై చక్కని రొమాంటిక్ వైబ్‌ను సృష్టించింది. ఈ పాట యువత ఆలోచనలు, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ, సినిమా యొక్క రొమాంటిక్ కామెడీ & సెంటిమెంటల్ జోనర్‌కు సరిగ్గా సరిపోయింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పాటకు స్ఫురణను, లయను అందించి, ప్రతి ఫ్రేమ్‌ను ఆకర్షణీయంగా మలిచింది.
లిరిక్స్‌లో పూర్ణ చారి యువత హృదయాలను తాకే సున్నితమైన పదాలను ఎంచుకున్నారు. ఈ పాటలోని దృశ్యాలు రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ నాణ్యమైన నిర్మాణ విలువలను ప్రతిబింబిస్తాయి. ఇవి యువత ఆకర్షణను, ఆధునిక జీవనశైలిని సమర్థవంతంగా చూపించాయి. మొత్తంగా, ‘పెదవుల తడి’ ఒక రిఫ్రెషింగ్, ఎనర్జిటిక్ ట్రాక్ గా రొమాంటిక్ వైబ్‌ను ఇస్తుంది. నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ..“‘వర్జిన్ బాయ్స్’ యువత ఆలోచనలను, భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని, దాన్ని త్వరలో ప్లాన్ చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!