దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీ అంతటా కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచే చీకట్లు అలుముకున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇక ముంబైలో కొత్తగా ప్రారంభించిన వర్లి భూగర్భ మెట్రో స్టేషన్ వరదల్లో మునిగిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం (నవంబర్ 29) అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆయా చోట్ల సాయంత్రం 4గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాకుండా సాయంత్రం సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.