Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- భారత్ వద్ద సరిపడా చమురు, గ్యాస్ నిల్వలు..
- గత నాలుగేళ్లుగా పెట్రోల్-డీజిల్ ధరల్ని పెంచలేదు..
- సవాళ్లు ఉన్న సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు..
- కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్-డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయనే వాదనల నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ జలసంధి సమస్యలు ఉన్నప్పటికీ, దేశం వద్ద ముడి చమురు, ఎన్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని ఆయన అన్నారు.
Read Also: Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
న్యూఢిల్లీలో జరిగిన ‘CII వార్షిక వ్యాపార సదస్సు 2026’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచదేశాలు చమురు సంక్షోభంతో ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఒక స్థిరమైన స్థితిలో ఉందని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లుగా ధరల్ని పెంచలేదని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చమురు ధరలు 50-60 శాతం పెరిగినట్లు చెప్పారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా భారత్ సవాలును ఒక అవకాశంగా మలుచుకుందని చెప్పారు. గతంలో రోజుకు 36,000 మెట్రిక్ టన్నులుగా ఉండేదని, ఇప్పుడు దానిని రోజుకు 54,000 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు వెల్లడించారు.
భారత్ వద్ద ప్రస్తుతం 60 రోజుల ముడి చమురు నిల్వలు, 60 రోజుల ఎల్ఎన్జీ, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. భారతదేశానికి సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని పూరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయిల్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. రోజుకు సుమారు రూ. 1000 కోట్లు నష్టపోతున్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!