Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friendship Day 2026: స్నేహం అనేది స్వచ్ఛమైన బంధం. రక్తసంబంధం లేకపోయినా, ఎవరితోనైతే మన మనసు విప్పి మాట్లాడుకోగలమో, ఎవరి దగ్గరైతే ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా ఉండగలమో వారే నిజమైన స్నేహితులు. మన సంతోషంలో భాగం పంచుకునేవారు చాలామంది ఉంటారు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే నిలబడి “నేనున్నాను” అని భరోసానిచ్చేవాడే అసలైన మిత్రుడు. కంటికి నలుసు పడితే చెయ్యి ఎలాగైతే క్షణాల్లో సాయానికి వెళ్తుందో, జీవితంలో ఏ ఆపద వచ్చినా ప్రతిఫలం ఆశించకుండా ముందుకొచ్చేది ఒక ఫ్రెండ్ మాత్రమే. “కష్టాల్లో తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు” అనే అబ్రహాం లింకన్ మాటలు దోస్తాన్ గొప్పతనాన్ని వర్ణిస్తాయి. స్నేహంలో వయస్సు, హోదా, ప్రాంతం వంటి తారతమ్యాలు ఉండవు, కేవలం హృదయాల అనుబంధం మాత్రమే ఉంటుంది. “జీవితంలో ఒక నిజమైన స్నేహితుడు లభిస్తే ప్రపంచంలో సగం విజయం సాధించినట్లే” అని ఆస్కార్ వైల్డ్ చెప్పినట్లు, అండగా నిలిచే మిత్రుడు ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ధన్యమే. అలాంటి అమూల్యమైన స్నేహ బంధాన్ని వేడుకలా జరుపుకోవడానికే ఫ్రెండ్షిప్ డే ఒక వేదికగా నిలుస్తుంది.
భారత్‌తో పాటు పలు దక్షిణాసియా దేశాల్లో ఆగస్టు మొదటి ఆదిత్యవారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది ఆ రోజే ఆగస్టు 2 కావడం విశేషం. అయితే గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు జూలై 30 అని చూపించడంతో చాలామంది అయోమయానికి గురవుతుంటారు. నిజానికి క్యాలెండర్లో రెండు ఫ్రెండ్షిప్ డేలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా గుర్తించింది. అయితే అంతకంటే దశాబ్దాల ముందే అమెరికా, భారత్, ఇతర దక్షిణాసియా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవడం ప్రారంభించాయి. ఐరాస క్యాలెండర్ జూలై 30 అని చెప్పినా, భారత్‌లోని కాలేజీ గ్రూపులు, ఆఫీస్ సర్కిల్స్ మాత్రం ఆగస్టు 2నే వేడుకలు జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాయి. సాంకేతికంగా రెండూ సరైనవే అయినా, భారత్‌లో ఆగస్టు మొదటి ఆదివారానికే ఎక్కువ క్రేజ్ ఉంది.
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
ఈ సాంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1930లో అమెరికాకు చెందిన గ్రీటింగ్ కార్డ్ వ్యాపారి జాయిస్ హాల్ ఆగస్టు 2ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని భావించారు. కాలక్రమేణా అమెరికాలో ఈ ఆలోచన కాస్త తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంది. 1958లో పరాగ్వేకి చెందిన డాక్టర్ రామోన్ ఆర్టెమియో బ్రాచో రాజకీయాల కంటే స్నేహమే దేశాల మధ్య శాంతిని, అవగాహనను పెంచుతుందని నమ్మి దీనిని మరింత ప్రచారం చేశారు. ఇక, మనదేశంలో ఫ్రెండ్షిప్ డే ఈ స్థాయిలో పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణం 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా. ఈ చిత్రంలో చూపించిన ‘ఫ్రెండ్షిప్ బ్యాండుల’ కాన్సెప్ట్ అప్పట్లో టీనేజర్లను, కాలేజ్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాలలు, కళాశాలలు దీనిని విశేషంగా స్వీకరించడంతో, ఎలాంటి ప్రభుత్వ ప్రకటన అవసరం లేకుండానే ఆగస్టు మొదటి ఆదివారం భారత్‌లో ఒక అన్అఫీషియల్ జాతీయ పండుగలా మారిపోయింది. గ్రీటింగ్ కార్డుల కంటే చేతికి కట్టే ‘ఫ్రెండ్షిప్ బ్యాండు’ భారత్‌లో దీనికి ప్రధాన చిహ్నంగా మారింది.
సోషల్ మీడియా యుగంలోనూ చేతికి రంగురంగుల బ్యాండ్లు, పూసల తాడు కట్టే అలవాటు తగ్గలేదు. ఈ సమయాల్లో స్టేషనరీ షాపుల్లో బ్యాండుల విక్రయాలు ఊపందుకుంటాయి. ఆదివారం ఉదయం నుంచే వాట్సాప్ గ్రూపులు పాత జ్ఞాపకాలు, ఫొటోలు, మెసేజ్‌లతో నిండిపోతాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులందరూ కలిసి లాంగ్ బ్రేక్‌ఫాస్ట్, కాఫీ కేఫ్‌లు, సినిమాలు లేదా సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ రోజును వేదికగా చేసుకుంటారు. కేవలం చాక్లెట్లు, కార్డులకే పరిమితం కాకుండా ఫొటో కొలాజ్‌లు, వాయిస్ నోట్స్, చేతితో రాసిన ఉత్తరాల వంటి వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. చాలామందికి ఉండే గందరగోళానికి సులువైన సమాధానం ఏమిటంటే.. జూలై 30 అనేది ఐరాస గుర్తింపు పొందిన ప్రపంచ తేదీ, కాగా ఆగస్టు 2 అనేది భారత్‌లో జరుపుకునే తేదీ. ఈ రెండింటిలో ఏ రోజున విష్ చేసినా తప్పు లేదు, కేవలం క్యాలెండర్ల తేడా మాత్రమే. ఆఖరికి, ఫ్రెండ్షిప్ డే అనేది ఒక నిర్దిష్ట తేదీకి సంబంధించింది కాదు. మన జీవితంలో నమ్మకంగా నిలిచిన మిత్రులకు ‘నువ్వు నాకు ముఖ్యం’ అని గుర్తుచేసే ఒక చిన్న కారణం మాత్రమే. చేతికి కట్టే బ్యాండు, పంపే మెసేజ్ లేదా కలిసే కాఫీ కప్పు.. ఏదైనా సరే, ఆ బంధంలో ఉండే స్వచ్ఛమైన స్నేహమే అసలైన వేడుక.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!