Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Bonalu- Secunderabad: సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. వేకువజామునే అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో జాతర ఘనంగా మొదలైంది. ఆలయ ప్రాంగణమంతా “జై ఉజ్జయిని మహంకాళి” నామస్మరణతో హోరెత్తుతోంది.
సిరిసంపదలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళా భక్తులు నెత్తిపై బోనాలు ఎత్తుకుని పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, సంప్రదాయ డప్పుల మోతలు, జానపద కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు, దర్శనాలతో పాటు ఆలయ పరిసరాల్లో వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, రేపు ఉదయం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘రంగం’ భవిష్యవాణి కార్యక్రమం, అనంతరం గజవాహన సేవ, ఘటాల ఊరేగింపు వైభవంగా సాగనున్నాయి. లక్షలాది మంది భక్తులు, వీఐపీల రాకతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో కళకళలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, సామాన్య భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు నగరం నలుమూలలా సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!