144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X500 Pro: వివో (Vivo) నుండి రాబోయే ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X500 Proను అతి త్వరలో చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు వరుసగా లీక్ అవుతున్నాయి. తాజా లీక్ ల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక 2nm MediaTek Dimensity 9600 Pro చిప్సెట్తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన BOE OLED డిస్ప్లేతో రాబోతుంది.
ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. Vivo X500 Proలో 6.37 అంగుళాల ఫ్లాట్ LTPO OLED డిస్ప్లే ఉండొచ్చు. ఈ స్క్రీన్ 1.5K కంటే ఎక్కువ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే అవకాశం ఉంది. అలాగే BOE రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ OLED ప్యానెల్‌ను తీసుకరాబోతున్నట్లు సమాచారం.
Also Read
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
ఈ ఫోన్లో MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని లీక్ పేర్కొంది. ఇది 2nm తయారీ ప్రక్రియపై రూపొందే చిప్సెట్ కావడంతో ఫాస్ట్ పనితీరు, అధిక పవర్ ఎఫిషియెన్సీ అందించనుందని అంచనా. Vivo X500 Proలో LIPO డిస్ప్లే ప్యాకేజింగ్ టెక్నాలజీను ఉపయోగించే అవకాశం ఉంది. దీని వల్ల స్క్రీన్ చుట్టూ నాలుగు వైపులా చాలా పలుచని బెజెల్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే Vivo X సిరీస్‌కు ప్రత్యేకమైన మధ్యలో వృత్తాకార (Circular) కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కొనసాగించనున్నట్లు సమాచారం. ఫోన్‌కు ప్రీమియం మెటల్ ఫ్రేమ్ కూడా ఉండొచ్చు.
గతంలో వచ్చిన లీక్‌ల ప్రకారం, Vivo X500 Proను కంపెనీ సెప్టెంబర్‌లో చైనా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న Vivo X300 Proకు సక్సెసర్‌గా రానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Vivo X300 Pro భారతదేశంలో రూ.1,09,999 ధరతో 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!