Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం
- ల్యాండింగ్ అవుతుండగా భారీ ఈదురుగాలులు
- భారీ కుదుపులకు గురైన విమానం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. కొరియన్ ఎయిర్‌కు చెందిన విమానం జపాన్ రాజధాని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు వీచాయి. దీంతో విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక పైలట్లు చాకచక్యంగా ల్యాండింగ్‌ను విరమించుకుని గగనతలంలోకి తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సురక్షితంగా విమానం ల్యాండింగ్ అవ్వడంతో అధికారులు, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు తీసుకున్న వేగవంతమైన నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ ఎయిర్ ఎయిర్‌బస్ A321neo విమానం టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో బలమైన క్రాస్‌విండ్స్, తీవ్ర గాలి అలజడి కారణంగా విమానం అదుపు తప్పినట్లు కనిపించింది. రన్‌వేపై దిగేందుకు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా ఎడమ, కుడి వైపులకు ఊగిపోవడం వీడియోల్లో కనిపించింది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గుర్తించిన పైలట్లు వెంటనే “గో అరౌండ్” ప్రక్రియను అమలు చేశారు. అంటే ల్యాండింగ్‌ను మధ్యలోనే నిలిపివేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి ఎగరేశారు. అనంతరం పరిస్థితులు అనుకూలించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అలాగే విమానానికి నష్టం జరగలేదని సమాచారం.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
టోక్యో పరిసరాల్లో బలమైన ఈదురుగాలులు వీచినట్లు సమాచారం. రన్‌వేకి అడ్డంగా వీచే గాలులను క్రాస్విండ్స్గా పిలుస్తారు. ఇవి విమానాల ల్యాండింగ్ సమయంలో పైలట్లకు పెద్ద సవాలుగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమానం సురక్షితంగా ల్యాండ్ కాకపోతే గో అరౌండ్ చేయడం సాధారణ భద్రతా చర్యగా విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు పైలట్ల చాకచక్యాన్ని ప్రశంసించారు.
“దైవం కాపాడింది.. పైలట్ అద్భుత నిర్ణయం తీసుకున్నాడు” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరో వ్యక్తి “ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండింగ్‌ను రద్దు చేయడం ఉత్తమ నిర్ణయం” అని పేర్కొన్నారు. మరొకరు “నరిటా విమానాశ్రయంలో గాలులు ఎంత ప్రమాదకరమో తెలిసిన విషయమే.. పైలట్ చాలా సమర్థంగా వ్యవహరించాడు” అని కామెంట్ చేశారు.
Korean Air plane fails to land due to strong crosswinds pic.twitter.com/zTrGu6U0T1
— Planesanity (@planesanity) May 11, 2026
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!