CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CWG 2026 Medals: కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిస్తున్న వేళ.. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అడగొడుతున్నారు. ఈ మెగా టోర్నీ 10వ రోజు (ఆగస్టు 1) భారత అథ్లెట్లు ఏకంగా 16 పతకాలు సాధించి దేశ సత్తా చాటారు. శనివారం నాడు (ఆగస్టు 1) ఏకంగా 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించడంతో భారత్ కు గోల్డెన్ డే గా మారింది. ఈ విజయాలతో CWC 2026 పతకాల పట్టికలో భారత్ ఒకేసారి ఆరు స్థానాలు ఎగబాకి 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది.
ఒక్క రోజులోనే 16 పతకాలు:
10వ రోజు ఆటల ప్రారంభానికి ముందు భారత్ ఖాతాలో 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు కలిపి మొత్తం 23 పతకాలు మాత్రమే ఉన్నాయి. అయితే శనివారం భారత క్రీడాకారులు అద్భుతం సృష్టించారు. ఒక్కరోజే మరో 16 పతకాలు అందించడంతో.. భారత్ మొత్తం 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు కలిపి 39 పతకాలతో నాలుగో స్థానానికి చేరుకుంది.
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
భారత బాక్సర్ల పంచ్:
భారత్ విజయాల్లో బాక్సర్లు కీలక పాత్ర పోషించారు. వివిధ కేటగిరీలలో 10 మంది భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. వారిలో 7 మంది స్వర్ణ పతకాలు, మిగిలిన ముగ్గురు ఫైనల్లో ఓడి రజత పతకాలు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత బాక్సర్లు ఒకే ఎడిషన్‌లో 7 స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి.

రజత, కాంస్య పతకాలలోనూ..
భారత్ 10వ రోజు మొత్తం 5 రజత పతకాలు గెలుచుకుంది. వీటిలో మూడు బాక్సింగ్‌లో మహిళల 75 కేజీలు, పురుషుల 90 కేజీలు, పురుషుల 55 కేజీల విభాగాల్లో వచ్చాయి. మిగిలిన రెండు రజతాలు పురుషుల ట్రిపుల్ జంప్, పురుషుల షాట్‌పుట్ F57 విభాగాల్లో లభించాయి. అలాగే భారత్ 3 కాంస్య పతకాలు కూడా సాధించింది. వీటిలో పురుషుల ట్రిపుల్ జంప్, 5000 మీటర్ల పరుగు, జూడో విభాగాల్లో ఒక్కో పతకం దక్కింది.
పారా అథ్లెటిక్స్‌లోనూ..
బాక్సింగ్‌తో పాటు పారా అథ్లెటిక్స్‌లో కూడా భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణా అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి మరో గోల్డ్ అందించాడు.
చివరి రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే పతకాల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 101 పతకాలతో (38 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!