ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఙడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని గురూజీ హత్య గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ఆయన్ను మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జూలై 2న తేదీన హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో గది అద్దెకు తీసుకుని పలువురికి వాస్తు శాస్త్రం చెబుతున్నారు చంద్రశేఖర్ గురూజీ. బుధవారం హోటల్ రూమ్ ఖాళీ చేస్తున్నానని చంద్రశేఖర్ గురూజీ హోటల్ యాజమాన్యంకు, అక్కడి సిబ్బందికి చెప్పారు. అయితే.. నిన్న (మంగళవారం) పట్టపగలు హోటల్ లోని రిసెప్షన్ సమీపంలో కుర్చున్న గురూజీ దగ్గరకు మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్ అనే వ్యక్తి,, అతని అనుచరుడు, వెళ్లి పాదాభివందనం చేశారు. ప్లాన్ ప్రకారం వెంటనే పైకి లేచిన నిందితుడు కత్తి తీసుకుని చంద్రశేఖర్ గురూజీని 40 సెకన్లలో 60 సార్లు గురూజీని పొడిచి చంపారు.
read also: NFSA: ఆహార భద్రతలో ఒడిశా నంబర్‌వన్.. తెలంగాణ స్థానం ఎంతో తెలుసా?
నిందుతుని భార్య గురూజీ వద్దే.. విచరణలో..
గతంలో.. మహంతేష్ భార్య కూడా చంద్రశేఖర్ గురూజీ దగ్గరే పని చేసేది అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే మహంతేష్ భార్య కొంతకాలం క్రితం చంద్రశేఖర్ గురూజీ దగ్గర ఉద్యోగం మానేయడం అనేక అనుమానాలకు దారితీసింది. మహంతేష్ కు చంద్రశేఖర్ గురూజీ దగ్గరుండి పెళ్లి చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. వాస్తు పరివార్ పేరుతో చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న ఆయనకు ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రశేఖర్ గురూజీకి 16 అవార్డులు వచ్చాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి వాస్తు శాస్త్రంలో పీహెచ్ డీ చేసిన చంద్రశేఖర్ గురూజీ డాక్టర్ పట్టా అందుకున్నారు. 2002లో సీజీ పరివార్ అనే ప్రైవేట్ సంస్థను ప్రారంభించారు. 2016లో సరళ జీవన ఇన్ఫో ఎంటర్ టైన్మెంట్ టీవీ చానల్ ను ప్రారంభించిన చంద్రశేఖర్ గురూజీ ఇప్పటి వరకు 350 మంది శిష్యులను తీర్చిదిద్ది ప్రపంచ వ్యాప్తంగా వాస్తు శాస్త్రం ఆరితేరిన అలాంటి గురూజీని అతికిరాతకంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.