Petrol-Diesel Prices: ముడి చమురు ధరలు తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు జనవరి 2024 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) లాభదాయకతను మెరుగుపరిచింది. దీంతో ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఏర్పడింది.