డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ ఊరట లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను తయారు చేయడానికి, విక్రయించడానికి మరియు పంపిణీ చేయడానికి బాంబే హైకోర్టు ఇవాళ అనుమతి ఇచ్చింది.. మహారాష్ట్ర ప్రభుత్వం కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ, ఉత్పత్తి తయారీ మరియు అమ్మకాలను నిలిపివేయాలని కోరింది.. అది కఠినమైన, అసమంజసమైన మరియు అన్యాయమైనదిగా పేర్కొంటూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, ఆ మూడు ఉత్తర్వులను రద్దు చేసింది బాంబే హైకోర్టు..…
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.
కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ఊపందుకుంది.. ఒకప్పుడు రోజుకు లక్షల్లో డోసులు వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఒకేరోజులో రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది భారత్.. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అర్హులైన జనాభా అంతటికీ కనీసం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాలనే లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి.. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ముందుంజలో ఉంది.. మరోవైపు.. పెద్దలకు సింగిల్ డోస్‌తో వ్యాక్సిన్ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 50 లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకారు రెండు డోసుల టీకాలు. రెండు డోసులు తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్…
కరోనాకు చెక్ పెట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీనిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు కూడా రావడంతో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందిస్తున్నారు.…
డెల్టా వేరియంట్ వందకు పైగా దేశాల్లో వ్యాపించింది. మిగతా వేరియంట్ల కంటే ఈ డెల్టా వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయి. ఎంత వరకు మహమ్మారిని కంట్రోల్ చేస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్…