GO First flight suffers bird hit, returns to Ahmedabad: ఇటీవల వరసగా పలు విమాన సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గో ఫస్ట్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో పక్షిని ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి చంఢీగఢ్ కు వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో పక్షిని ఢీ కొట్టింది. దీంతో వెంటనే ఫైలెట్లు విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
గతంలో జూన్ 20న స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఢిల్లీకి వెళ్లే క్రమంలో పాట్నా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో పక్షిని ఢీకొట్టింది. ఎడమ ఇంజిన్ ను పక్షి ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంజిన్ కు వెళ్లే ఫ్యూయల్ సప్లైని నిలిపివేసిన పైలెట్లు మళ్లీ పాట్నాలో సురక్షితంగా దించారు. ఈ ప్రమాాదంలో 185 మంది ప్రయాణికులు సురక్షితం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదే రోజు గౌహతి నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం కూడా టెకాఫ్ తరువాత పక్షిని ఢికొట్టింది. దీంతో గౌహతి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Read Also: Kareena Kapoor: సీత పాత్ర కోసం అక్షరాలా రూ. 12 కోట్లు.. కరీనా ఏం చెప్పిందంటే..?
గత నెలలో ఇదే గో ఫస్ట్ సంస్థకు చెందిన మూడు విమానాలు రెండు రోజుల వ్యవధిలో ప్రమాదానికి గురయ్యాయి. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్లే క్రమంలో విమానం విండ్ షీల్డ్ పగిలిపోయింది. దీంతో విమానాన్ని జైపూర్ కు మళ్లించారు.ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ విమానాల్లో కూడా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానాన్ని సాంకేతిక కారణాలతో పాకిస్తాన్ కరాచీ విమానాశ్రయంలో దించారు. జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని కూడా సాంకేతిక కారణాల వల్ల కరాచీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఇటీవల తరుచుగా జరిగిన విమాన ప్రమాదాలపై డీజీసీఏ విచారణ చేస్తోంది.