50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్’ విమానం సరిగ్గా చెక్ చేసుకోకుండానే గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.
Foreign Tourist Harasses Flight Attendants On GO First's Delhi-Goa Flight: విమానాల్లో ప్రమాణికలు అకృత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సీనియర్ సిటిజెన్ పై మద్యం మత్తులో యూరిన్ చేశాడు. దీని తర్వాత పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే మరో విమాన ఘటనల తాజాగా వెలుగులోకి వచ్చింది.
GO First flight suffers bird hit, returns to Ahmedabad: ఇటీవల వరసగా పలు విమాన సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గో ఫస్ట్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో పక్షిని ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి చంఢీగఢ్ కు వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో పక్షిని ఢీ కొట్టింది. దీంతో వెంటనే ఫైలెట్లు విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ప్రమాదంపై…
విమానయానం అంటే జనాలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మనం ఎక్కే విమానం క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ఒక్క నెలలోనే మొత్తం 9 మిడ్ ఎయిర్ ప్రమాదాలు జరిగాయి. ఆకాశంలో ఉండగానే సాంకేతిక లోపాలతో ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. జూలై 5 నుంచి జూలై 21 మధ్య ఈ తొమ్మిది ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు ప్రయాణికుల రక్షణను ప్రశ్నిస్తున్నాయి.
ఇండియాలో వరసగా పలు సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గాల్లో ఉండగానే విమానాాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో సంఘటన జరిగింది. గో ఫస్ట్ సంస్థకు చెందిన ఏ 320 నియో విమానం గాల్లో ఉండగానే ఫ్లైట్ అద్దాల పగిలిపోయింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే విమానాాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)…