Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం సెలక్టివ్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకొంటుంది. ఇక తాజాగా ఆమె నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. అమీర్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రంలో కరీనా హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కరీనా సినిమా గురించిన కబుర్లతో పాటు తన మీద వచ్చిన కొన్ని రూమర్స్ కు కూడా చెక్ పెట్టింది. ఇక గత కొన్నిరోజుల నుంచి కరీనా.. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయణం లో సీత పాత్రకు ఎంపిక అయ్యిందని. ఆ పాత్ర కోసం అక్షరాలా రూ. 12 కోట్లు రెమ్యూనిరేషన్ అడిగినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్ పై కరీనా స్పందించింది.
ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలియదు అని చెప్పుకొచ్చింది. తన వద్దకు ఎలాంటి రామాయణం కథ రాలేదని, అసలు కథే నా దగ్గరకు రానప్పుడు రెమ్యూనిరేషన్ అడిగానని ఎలా చెప్తానని చెప్పుకొచ్చింది. తనకు తన కుటుంబంతోనే సరిపోతుందని, ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినా ఈ రూమర్స్ తో చాలా ఇబ్బందిగా ఉందని, వారికి సమాధానం ఇవ్వాలో లేదో కూడా తెలియడం లేదని తెలిపింది. సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు ఎవరికి తోచింది వారు రాసేస్తున్నారని, దయచేసి ఏదైనా రాసేటప్పుడు నిజనిజాలు తెలుసుకోవాలని కోరింది. ఇక దీంతో ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని తేల్చేసింది. మరి ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.