Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్‌తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..
- మహ్మద్ యూనస్‌తో జార్జ్ సోరోస్ కుమారుడి భేటీ..
- బంగ్లాదేశ్‌కి ట్రంప్ నిధులు ఆపేసిన తర్వాత కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్‌పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
వీరిద్దరు ఢాకాలో సమావేశమయ్యారు. సోరోస్, OSF అధ్యక్షుడు బినైఫర్ నౌరోజీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాత్కాలిక ప్రభుత్వ సంస్కరణల ఎజెండాకు మద్దతు తెలిపినట్లు మహ్మద్ యూనస్ తెలిపారు. “ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి, మోసపోయిన ఆస్తులను కనుగొనడానికి, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి, కీలకమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలను చర్చించడానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ నాయకత్వం బుధవారం ప్రధాన తాత్కాలిక సలహాదారుని కలిసింది” అని యూనస్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
ఆర్థిక సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ, ఆస్తుల రికవరీ, కొత్త సైబర్ భద్రతా చట్టాలు, రోహింగ్యా సంక్షోభం వంటి అంశాలు చర్చలో కీలకంగా ఉన్నాయని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్ నెలలో అంటే, షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయన రెండు నెలల తర్వాత అలెక్స్ సోరోస్, యూనస్ న్యూయార్క్‌లో కలుసుకున్నారు. మహ్మద్ యూనస్‌ని తన తండ్రి( జార్జ్ సోరోస్) పాత స్నేహితుడు అంటూ అలెక్స్ సోరోస్ ప్రశంసించారు. బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ మరియు సామాజిక కార్యకలాపాలలో తన కృషికి పేరుగాంచిన యూనస్‌కు జార్జ్ సోరోస్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.
అమెరికన్ బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్, పలు దేశాల్లో అధికార మార్పిడికి కుట్రలు పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో కూడా షేక్ హసీనాను దించడంలో ఇతడి ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్‌లో అశాంతికి అమెరికా ప్రమేయం ఉందని గతంలో షేక్ హసీనా వ్యాఖ్యానించింది. ఇటీవల మన దేశంలో కూడా జార్జ్ సోరోస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మన దేశాన్ని అస్థిర పరిచేందుకు జార్జ్ సోరోస్, అతడి సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ బీజేపీ ఆందోళన వ్యక్తి చేసింది. కాంగ్రెస్ పార్టీకి అతడితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!