Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్‌పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.