India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
- భారతదేశానికి సొంత ఏఐ..
- 6-8 నెలల్లో ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇప్పటికే అమెరికా చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. అయితే, వీటికి పోటీగా వచ్చిన చైనీస్ ఏఐ మోడల్ ‘‘డీప్ సీక్’’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ని అభివృద్ధి చేయబోతోంది.
Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఉత్కర్ష్ ఒడిశా కాన్‌క్లేవ్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విణి వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని డెవలప్ చేయడానికి 18,693 జీపీయూ కలిగిన కంప్యూట్ ఫెసిలిటీ ఏర్పడినట్లు చెప్పారు. 6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడళ్లను డెవలప్ చేయడాని కనీసం ఆరుగురు ప్రధాన డెవలపర్లు ఉన్నారని చెప్పారు. బలమైన ఏఐ ఎకో సిస్టమ్ సృష్టించడానికి కంప్యూట్ సౌకర్యం అత్యంత ముఖ్యమైన భాగం అని వైష్ణవ్ చెప్పారు. పరిశోధకులు, స్టార్టప్స్, విద్యా సంస్థలకు ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి హైఎండ్ కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. ఇండియా AI మిషన్‌లో భాగంగా, ప్రభుత్వం షేర్డ్ కంప్యూటింగ్ వనరును స్థాపించడానికి ప్రాధాన్యతనిచ్చింది.
కంప్యూటింగ్ ఫెసిలిటీ ముందు అనుకున్న దాని కన్నా అంచనాలు మించిపోయిందని, మొదట ప్రణాళిక ప్రకారం.. 10,000 GPUలకు బదులుగా దాదాపు 19,000 GPUలను పొందిందని, 1,480 ఎన్‌విడియా H200 GPUలు ఉన్నాయని, వీటిలో కొన్ని చాలా శక్తివంతమైన ఏఐ చిప్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీటిలో దాదాపుగా 10,000 GPUలు తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో పనిచేయడం ప్రారంభమవుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!