Rajiv Gandhi Foundation: సోనియాగాంధీకి బిగ్ షాక్.. రెండు ఎన్జీవోల లైసెన్సులు రద్దు.. సీబీఐ దర్యాప్తుకు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరో కేసులో గాంధీ కుటుంబం బుక్ అయింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆర్జీఎఫ్ కు చీఫ్ గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాలు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సభ్యులుగా ఉన్నారు. ఆర్జీసీటీకి సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా ఉండగా.. రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ ఎస్. గంగూలీ సభ్యులుగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఈ రెండు ఎన్జీవోల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు 2020లో హో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ కమిటీ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పత్రాలను తారుమారు చేయడంతో పాటు, నిధుల దుర్వినియోగం, చైనాతో సహా ఇతర విదేశాల నుంచి నిధులు పొందుతున్న సమయంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఎన్జీవోలు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ విచారించే అవకాశం కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రెండు సంస్థలు 2005-09 మధ్య చైనా నుంచి నిధులు తీసుకున్నట్లు ఆరోపించారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్జీఎఫ్ కి నిధులు అందాయని.. దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మోహుల్ చోక్సీ నుంచి కూడా వీటిని నిధులు అందాయని నడ్డా ఆరోపించారు. చైనా-ఇండియా మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం లాబీయింగ్ చేయడానికి ఆర్జీఎఫ్ కు నిధులను చైనా లంచంగా ఇచ్చిందనే ఆరోపణలను చేసింది బీజేపీ.
తాజావార్తలు
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!