Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఆప్
For Delhi Mayor Polls AAP Goes To Supreme Court: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 6వ తేదీన జరగాల్సిన ఈ ఎన్నికలు.. కార్పొరేటర్ల రసాభాసతో వాయదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఓ ఊహించని షాక్ ఇచ్చింది. ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడిందని, ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) సరైన స్పష్టత ఇవ్వడం లేదని, నిర్ణీత సమయంలోపు ఎన్నిక నిర్వహించేలా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను ఆదేశించాలని కోరుతూ.. ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లకు ఓటింగ్ అర్హత లేదని, వాళ్లను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించాలని కూడా ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Bridegroom : పెళ్లి పనులు చేస్తూనే.. వరుడు అనంతలోకాలకు
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
కాగా.. డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 104 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో.. షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా, మరో ఆప్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల బరిలోకి దిగింది. దాంతో.. ఈనెల 6వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. కార్పొరేటర్ల రసాభాసతో ఎన్నిక వాయిదా పడింది. 24వ తేదీన ఎన్నిక నిర్వహించాలని యత్నించగా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ దెబ్బకు ఎన్నికలు మళ్లీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి, ఊహించని పరిణామానికి తెరలేపింది.
Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?