Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Fired A Married Couple With 4 Month Old Baby: ప్రైవేట్ కంపెనీలు ఈమధ్య ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే! తమ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా.. ఆ కంపెనీలు క్రమంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. దీంతో.. ఐటీ రంగంలోని ఉద్యోగులు ఎక్కడ తమకు లేఆఫ్ వార్త వినాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సింపుల్‌గా ఒక మెయిల్ పంపంచి, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని కంపెనీలు బాంబులు పేల్చుతున్నాయి. చివరికి ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ సైతం లైఆఫ్ బాట పట్టింది. తమ ఉద్యోగుల్ని తొలగించే పనిలో నిమగ్నమైంది.
At Home At RajBhavan: ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఇప్పుడు తాజాగా ఒకేసారి భార్యాభర్తలిద్దరినీ గూగుల్ తొలగించినట్టు సమాచారం. వాళ్ల పేర్లు అలీ(Allie), స్టీవ్ బీగన్. అలీ నాలుగు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనివ్వగా.. ప్రస్తుతం ఆమె మెటర్నిటీ లీవ్‌లో ఉంది. ఈమె గత ఆరు సంవత్సరాల నుంచి గూగుల్ సంస్థలో పని చేస్తుంది. స్టీవ్ నాలుగు సంవత్సరాల నుంచి గూగుల్‌లో పని చేస్తున్నాడు. అయితే.. సంస్థ నుంచి ఆ ఇద్దరికి ఒకేసారి లేఆఫ్ సందేశం వచ్చింది. అది చూసి వాళ్లు ఖంగుతిన్నారు. తమ బిడ్డ కోసం మరికొంత కాలం సెలవులు పెట్టాలని ఆ జంట భావిస్తే.. రివర్స్‌లో సంస్థే వారికి షాకిచ్చింది. ఇకపై రావాల్సిన అవసరం లేదంటూ.. ఉద్యోగంలో నుంచి గూగుల్ తీసేసింది. ఈ దెబ్బతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోవట్లేదు.
Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా
కాగా.. అంతర్జాతీయంగా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాలని గూగుల్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సమయంలో అప్పటి అవసరాలకు తగ్గట్టు అధిక నియామకాలు చేపట్టామని.. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల్ని తీసివేయాల్సి వస్తోందని సంస్థ పేర్కొంది. ఈ లేఆఫ్స్‌పై సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో స్పష్టమైన, ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారి ఉండేది వివరించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!