Road Accident: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 42 మందికి గాయాలు అయ్యాయి. కేసర్ నుంచి పంధర్‌పూర్‌కు వెళ్తుండగా ట్రాక్టర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. అయితే, ట్రాక్టర్‌ను ఢీకొని ప్రైవేటు బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. గాయపడిన 42 మందిని ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మరో ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం అంబులెన్స్ లో తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్!
అయితే, ఆషాఢి ఏకాదశి సందర్భంగా ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేలో సోమవారం అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో 54 మంది ప్రైవేట్ బస్సులో పంఢర్‌పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేలోని ముంబై- లోనావాలా మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. క్రేన్ సహాయంతో బస్సును తొలగించి.. మూడు గంటల తర్వాత ట్రాఫిక్‌ను పోలీసులు పునరుద్ధరించారు. కాగా, ఈ ప్రమాదంపై నవీ ముంబై డీసీపీ వివేక్ పన్సారే మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
#WATCH | Mumbai | Four people died and several others were injured after a bus collided with a tractor and fell into a ditch near the Mumbai Express Highway. All the injured were admitted to the nearby MGM Hospital: Pankaj Dahane, DCP Navi Mumbai Police
The bus with devotees… pic.twitter.com/4HY3vdPVEp
— ANI (@ANI) July 15, 2024